డబ్బు దొంగతనం చేసి పారిపోయిన విజే సన్నీ.. సీసీటీవీ కెమెరాకు దొరికేశాడు!
on Jan 6, 2023

బిగ్ బాస్ సీజన్ 5 సన్నీ దొంగగా మారాడు. సీసీ టీవీ ఫుటేజ్‌లో సన్నీ క్యాష్ బ్యాగ్ తీసుకుని పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్నీ స్టార్టింగ్‌లో వీడియో జాకీగా కొన్ని చానెల్స్ లో పని చేసాడు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఆఫర్ వచ్చింది. దాని వలన మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇటీవల సన్నీ ‘సకలగుణాభిరామ’ అనే మూవీలో లీడ్ రోల్ చేసాడు. కానీ అది పెద్దగా ఆడలేదు.
ఏం జరిగిందో ఏమో కానీ సన్నీ రీసెంట్‌గా అనుమానాస్పద రీతిలో ఒక కారులో వచ్చి పరిగెత్తుకుంటూ ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి అంతే స్పీడ్‌తో ఒక బ్యాగ్‌తో రివర్స్‌లో పరిగెత్తుకుని వచ్చాడు. ఐతే బ్యాగ్‌ని కారులో పెట్టబోయేసరికి సన్నీ కాలు స్లిప్ అయ్యింది. దాంతో చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడి అందులో ఉన్న డబ్బు కట్టలు బయట పడ్డాయి. వాటిని మళ్ళీ బ్యాగ్‌లో పెట్టేసుకుని తనను ఎవరూ చూడడం లేదు కదా అని అనుకుని బ్యాగ్‌ని కార్ బ్యాక్ సీట్‌లో వేసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఇంతకూ విషయం ఏమిటి అనేది ఇంకా తెలియలేదు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదైనా సినిమాకి సంబంధించిన ఒక రోల్‌లో నటించడం కోసం ఇదంతా ప్లాన్ చేశారా? లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అనేది ఇంకా తెలియదు.. లేదా తాను హీరోగా నటించిన "అన్ స్టాపబుల్" మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా… ఇలా వెరైటీగా మూవీ ప్రమోషన్ చేశాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



